అంకమ్మ తల్లి కట్ట మైసమ్మ తల్లి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి
:కట్ట మైసమ్మ వార్షికోత్సవంలో పోటెత్తిన భక్తులు…
: ద్వారకుంట గ్రామ సర్పంచ్ పాలకు సురేష్
Mbmtelugunews//కోదాడ, మార్చి 03 ( ప్రతినిధి మాతంగి సురేష్):అంకమ్మ తల్లి కట్ట మైసమ్మ తల్లి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి గ్రామంలో పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో అంకమ్మ తల్లి పండుగ, కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవ వేడుకలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాలకీ సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామునే అమ్మవార్లకు అభిషేకాలు జరిపి తిరొక్క పూలతో అందంగా అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. భక్తులు చీరలు, సారె పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు అని వారు అన్నారు. గ్రామదేవతలను పూజించడం వలన గ్రామం ప్రశాంతమైన వాతావరణంలో సుభిక్షంగా ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



