అంకిత భావంతో పనిచేసే ఉద్యోగికి గుర్తింపు:కొంపల్లి బిక్షపతి
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 29(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రభుత్వ ఉద్యోగి తన వృత్తిలో అంకిత భావంతో పని చేస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి అన్నారు.పట్టణంలోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో మాతంగి ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అభినందన సభను ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి బిక్షపతి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానం విజయకుమార్ పాల్గొని మాట్లాడుతూ మాతంగి ప్రభాకర్ రావు తన వృత్తికి వన్నెతెచ్చారని కొనియాడారు.తను పనిచేసిన పాఠశాలలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి ఎనలేని కృషిచేసి బలోపేతం చేశారని సమాజానికి వీరి చేసిన సేవలు ఎంతో అభినందనీయమని తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర బాధ్యులు బొడ్డు హుస్సేన్,పాల్వాయి వెంకటయ్య,మాండన్ రేణుక,నామ నాగయ్య,జిల్లా బాధ్యులు అమరబోయిన వెంకటరత్నం,అయోధ్య,ఉపేందర్,రవీందర్,రామకృష్ణ,రాములు,పోచన్న,ప్రసాదు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.