అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం
కనులారా తిలకించిన భక్త మహా జనులు
Mbmtelugunews//కోదాడ, మార్చి 27 (ప్రతినిధి మాతంగి సురేష్): శ్రీరామనవమి సందర్భంగా పట్టణ పరిధిలో తమ్మర లో రెండో భద్రాద్రిగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఆలయ చైర్మన్ బత్తినేని వేణుగోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో బాజా భజంత్రీలతో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కల్యాణాన్ని కనులారా తిలకించారు.

కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణానికి తిలకించడానికి వచ్చిన భక్తులకు భక్తులు, యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ, పులిహోర, పంపిణీ చేశారు. ప్రత్యేకంగా తయారుచేసిన పానకం ప్రజల దాహార్తిని తీర్చింది. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు అనంతరం అన్న ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.



