ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే అండర్-16 అంతర్ జిల్లా క్రికెట్ కు పోలూరి మణికృష్ణ,మరికంటి భువన్ సాయిలు ఎంపిక:కోచ్ సిద్ధిక్
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 16 ప్రతినిధి మాతంగి సురేష్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఉప్పల్లో నిర్వహించే అండర్ – 16 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు పోలూరి మణికృష్ణ,మరికంటి భువన్ సాయి కోదాడ వారు ఎంపికైనట్లు కోచ్ షేక్ సిద్ధిఖ్ తెలిపారు.విరు ఈ నెల 17 వ తారీఖు నుండి ప్రారంభమయ్యే అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.గత 8 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీలో కోచ్ షేక్ సిద్ధిఖ్ సారధ్యంలో శిక్షణ తీసుకుంటున్నారు.మీరు ఎంపిక సందర్భంగా మండల విద్యాధికారి మహమ్మద్ సలీం షరీఫ్,జిల్లా అసోసియేషన్ కార్యదర్శి నాయిని శ్రీనివాస్ రావు,ప్రవీణ్,కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డా,, కొత్తపల్లి సురేష్,దర్గయ్య,చందా శ్రీను,తుమ్మల సురేష్,నాయిని నాగేశ్వర్ రావు,ఖాజామియ,జబ్బర్,శ్రీకాంత్,బులైయ్య తదితరులు అభినందనలు తెలియజేశారు.