అండర్–19 క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీకి ముగ్గురు క్రీడాకారులు ఎంపిక
Mbmtelugunews//కోదాడ, ఆదివారం 23 (ప్రతినిధి మాతంగి సురేష్): 59వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణం. అండర్ 19 విభాగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఆల్‌రౌండర్ భుక్య చందు, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మరికంటి భువన్ సాయి, ఫాస్ట్ బౌలర్ ఓరుగంటి సాయిష్ ఎంపికైనట్లు కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు. వీరు ఈ నెల 24 నుండి సికింద్రాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంలో జట్టుకు ఎంపికైన
ఆల్ రౌండర్స్ ప్రదర్శించిన కృషి, క్రమశిక్షణ, నిబద్ధతను ప్రత్యేకంగా మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ప్రశంసించారు. కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్దిఖ్ పాత్రను ప్రస్తావిస్తూ, కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ కృషి ఈ ముగ్గురు క్రీడాకారులు ఎన్నో నెలలుగా నిరంతర సాధనతో తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. వీరి ఆటతీరును తీర్చిదిద్దడంలో షేక్ సిద్దిఖ్ చూపిన అంకితభావం నిజంగా అభినందనీయం. ఉదయం, సాయంత్రం ఎలాంటి విరామం లేకుండా పిల్లలతో కఠినంగా శిక్షణ నిర్వహించటం వల్లే ఇవాళ ఈ విజయాలు సాధ్యమయ్యాయి. రాష్ట్రస్థాయిలో కూడా వీరు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని నమ్మకం ఉందని అన్నారు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ సలీం షరీఫ్, అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, డాక్టర్ నందకిషోర్, సభ్యులు, ఖాజా మియా, జబ్బార్, వేమూరి సతీష్, షేక్ మీరా, తుమ్మల సురేష్, శ్రీకాంత్, బుల్లయ్య, శ్రీను, రవీందర్ రెడ్డి, తదితరులు క్రీడాకారులను అభినందించారు.



