కోదాడ,మార్చి 08(మనం న్యూస్)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టీఎన్జీవోఎస్ సూర్యాపేట జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రమాదేవి లను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అన్నారు. సృష్టికి మూలం మహిళా అని మహిళలు విద్య ఉద్యోగ రాజకీయ సామాజికంగా ఎదగాలని అన్నారు.మహిళా ఇంటికే పరిమితం కాదని మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని వారన్నారు మహిళలపై జరుగుతున్న అన్యాయాల పై అవగాహన పెంచుకోవాలన్నారు.విద్యార్థినులు చదువు అనే ఆయుధంతో సమాజంలో ఎదిగి అన్ని రంగాలలో రాణించాలన్నారు.కోదాడ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య,రాష్ట్ర ఈసీ మెంబర్ పి వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు ఆళ్లగడప సైదులు,కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం చిరంజీవి,కార్యదర్శి చిత్తలూరి పద్మ,హుజూర్ నగర్ యూనిట్ అధ్యక్షుడు చిత్తలూరి అశోక్,రుక్మిణి,నలమాద భవాని,అరుణ,సునీత,రేవతి,మమత,శ్రీ వాణి,ఝాన్సీ,రమాదేవి,అలేఖ్య,ఎంపీ ఓ పాండు,సీనియర్ అసిస్టెంట్ రవికుమార్,మహేష్,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని సన్మానించిన టిఎన్జిఓఎస్
RELATED ARTICLES



