అంతర్జాతీయ యోగా పోటీలకి ఎంపికైన కోదాడవాసి
Mbmtelugunews//కోదాడ,జనవరి 08(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణానికి చెందిన యోగ క్రీడాకారుడు కీతా శ్రీనివాసరావు ఇటీవల జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025–26 లో అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తండ్రి వెంకటనర్సయ్య, తల్లి జానకమ్మల ద్వితీయ కుమారుడైన కీతా శ్రీనివాసరావు విద్యాభ్యాసంలో M.Sc., M.A., B.Ed., M.Sc (Yoga) అర్హతలు సాధించారు. యోగాని శాస్త్రీయంగా ఆచరిస్తూ, శిక్షణ ఇవ్వడంలోనూ విశేష అనుభవం కలిగి ఉన్నారు.
*యోగ విభాగంలో గోల్డ్ మెడల్*
2- 5 కిలోమీటర్ల వాక్ రేస్‌లో గోల్డ్ మెడల్,
3- 800 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్
సాధించి, రాబోయే ఏప్రిల్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందారు.
ఆరోగ్యమే అసలైన సంపద అన్న భావనతో, తన కూతురు శ్రీ లాస్య వర్మ, కుమారుడు శ్రీ కార్తికేయ వర్మలకు కూడా చిన్న వయసు నుంచే యోగ శిక్షణ అందిస్తూ క్రమశిక్షణను అలవర్చుతున్నారు. ఇప్పటివరకు సిద్ధిపేటలో జరిగిన సూర్యనమస్కార పోటీలో 675 రౌండ్లు పూర్తి చేయడం, నాలుగు సార్లు యోగ నేషనల్స్‌కు ఎంపిక కావడం,
*గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్*
లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందడం, ఆంధ్రప్రదేశ్ అరకు ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ యోగ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
రాబోయే అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణకు బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కీతా శ్రీనివాసరావు కు, తెలంగాణ ప్రభుత్వం, పురగిరి క్షత్రియ కమ్యూనిటీ, అలాగే ఇతర సంస్థలు ఆర్థికంగా సహకరిస్తే రాష్ట్ర గౌరవం, కుల గౌరవం అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.



