అందర్-బాహర్ పేకాట ఆడుతూ ఎనిమిది మంది అరెస్టు
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్)శుక్రవారం సాయంత్రం సూర్యాపేట రోడ్ లోని శ్రీ రాజ్యలక్ష్మి సీడ్స్ & ఫెస్టిసైడ్ షాప్ యొక్క పై అంతస్థు నందు ప్రభుత్వ నిషేదిత అందర్-బాహర్ పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా కోదాడ టౌన్ సిఐ టి రాము ఆదేశానుసారంగా టౌన్ ఎస్సై ఏ రంజిత్ రెడ్డి,సిబ్బంది తో వెళ్ళి రైడ్ చేయగా పోలీసు వారి రాకను పసిగట్టిన ముగ్గురు వ్యక్తులు పారిపోగా,బానోతు రూప్లా,చింతల నాగేశ్వరరావు,బాణోతు బాలు,పాయలి వెంకటేశ్వర్లు,బాణోతు వీరన్న అనే వారు పట్టుబడినారు.వారి వద్ద నుండి రూ. 10,200/- నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకోవటం జరిగింది. పారిపోయిన ఇంటి యజమాని ముక్కా వేణు, నరసింహారావు,విజయ్ అనే వారితో సహా మొత్తం (8) మంది పై కేసు నమోదు చేసినట్లుగా కోదాడ టౌన్ సీఐ టీ రాము కేసు నమోదు చేసినట్లుగా పత్రికా ప్రకటన లో తెలిపినారు.