అందుబాటులోకి నాణ్యమైన వైద్యం……
:వైద్య సేవలు పేదలకు అందాలి……..
:చైర్పర్సన్ ఎర్నేని కుసుమ…….
:శ్రీ లేఖ హాస్పిటల్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్……
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 20(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అనే సూక్తిని స్మరిస్తూ, వైద్యాన్ని కేవలం వ్యాపారంగా చూడకుండా సామాజిక దృక్పథంతో రోగులకు సేవలు అందించాలన్నారు . ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మీసా రోహిత్ ఎంబిబిఎస్,ఎండి క్రిటికల్ కేర్ మరియు ఊపిరితిత్తుల ప్రత్యేక వైద్య నిపుణులు, డాక్టర్ కూరపాటి శ్రీలేఖ ఎంబిబిఎస్, డిజిఓ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు ఇరువురు యువ వైద్యులు కోదాడలో సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కారింగుల అంజన్ గౌడ్, డాక్టర్ దశరథ, డాక్టర్లు రామారావు, అశోక్, గౌరీనాథ్, ప్రసాద్, కరుణశ్రీ, సురేష్, కొత్తమాసు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు……..



