కోదాడ,డిసెంబర్ 31 (mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కోదాడ పట్టణంలో ప్రజలు భారీ మొత్తంలో షాపుల వద్దకు వచ్చి వారికి కావలసినవి కొనే సమయంలో పట్టణంలో కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇలానే కొంతసేపు కరెంట్ రాకుండా ఉంటే ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో ప్రజలు ఏమి చేసుకోలేరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో కరెంటు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
*ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు నీ శరవాణి ద్వారా వివరణ అడగగా:* కోదాడ పట్టణంలో కొంత ఏరియాలో లైన్ ప్రాబ్లం వచ్చి కరెంటు ట్రిప్ అయింది మా సిబ్బంది క్లియర్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.



