అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి:పందిరి నాగిరెడ్డి
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక ఎమ్మెస్ కళాశాలలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్,టీఎస్ఆర్జెసి ఎంట్రెన్స్ శిక్షణ కేంద్రంలో ఘనంగా భారతరత్న,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెస్ కళాశాల చైర్మన్ పందిరి నాగ రెడ్డి,తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు రాయపూడి వెంకటేశ్వరరావు, ఆస్క్ వ్యవస్థాపక అధ్యక్షులు బల్గూరి దుర్గయ్య హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ
దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక,ఆర్థిక,రాజకీయ సమ న్యాయం ఉండాలని తన జీవితాన్ని అంకితం చేసిన రాజ్యాంగ రూపకర్త,భారతరత్న డా,బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా వినమ్ర పూర్వక నివాళులు తెలియజేస్తూ విద్యార్థినీ,విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను చేరుకొని ఈ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు రాయపూడి చిన్ని మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి న్యాయ,సామాజిక,ఆర్థిక,ఆధ్యాత్మిక,తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి రాజకీయ,ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలని కోరారు.

ఆస్క్ వ్యవస్థాపక అధ్యక్షులు బల్గూరి దుర్గయ్య మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం,ఆత్మవిశ్వాసం కలిగించి దేశ ప్రజలందరికీ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని,ఈ అట్టడుగు వర్గాల నుండి అభివృద్ధి చెందిన అందరూ పే బ్యాక్ టు సొసైటీ ద్వారా దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,పోలీస్ కానిస్టేబుల్ కుర్రి నాగరాజు,కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం బుచ్చారావు,గౌరవ సలహాదారులు నందిపాటి సైదులు,ఫ్యాకల్టీ చెరుకుపల్లి కిరణ్,కన్నయ్య,షరీఫ్,గిరి ప్రసాద్,మీసాల రవి,విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.