అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
:అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండపాలెం స్థానిక రెండో వార్డ్, నాలుగో వార్డు లలొ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారతరత్న,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్త కాలనీ,పాతకాలనీలలో అంబేద్కర్ చిత్రపటానికి అంబేద్కర్ యూత్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను విడనాటి విద్యను ప్రోత్సహించాలి, అక్కులు కల్పించిన మహనీయుడు ఆదర్శప్రాయుడు అనే కొనియాడారు.దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వంతోపాటు సాంఘిక,ఆర్థిక,రాజకీయ సమ న్యాయం ఉండాలని తన జీవితాన్ని అంకితం చేసిన రాజ్యాంగ రూపకర్త,

భారతరత్న డా.బీఆర్.అంబేద్కర్ అని కొనియాడారు, యువత అంబేద్కర్ ఆశయాలను సాధించిన నాడే మనం ఆయనకు ఇచ్చే ఘన నివ్వాలని తెలిపారు.అలాగే త్వరలో కొత్త కాలనీ పాత కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తీసుకువచ్చిన విగ్రహాలను తమ్మర గ్రామములో పెద్ద ఎత్తున బైకు ర్యాలీలతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ఊరేగింపులో పెద్ద ఎత్తున యువత మహిళలు జై భీమ్ నినాదాలతో నీలి జెండాలను చేత భూని కదం తొక్కారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ యూత్ సభ్యులు మహిళలు యువతి,యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు