అంబేద్కర్ యూత్ నూతన కమిటీ ఎన్నిక
హుజూర్‌నగర్,జూన్ 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామములో ఆదివారం అంబేద్కర్ యూత్ నూతన కమిటీని ఏకీగ్రీవంగా ఎన్నుకున్నట్టు అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు తెలియజేశారు.నూతన కమిటీ అధ్యక్షునిగా నందిపాటి నరేష్ ,ఉపాధ్యక్షుడు చిటికెల కిరణ్,కోశాధికారి లంకపల్లి రమేష్,ప్రధాన కార్యదర్శి ఒగ్గు మహేష్,సభ్యులుగా ఇరుగు అనిల్,కదురు మహేష్,చిలక మధు లను ఎన్నుకున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా నందీపాటి నరేష్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకునందుకు అంబేద్కర్ యూత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నందిపాటి మల్లయ్య,నందిపాటి సామ్రాట్,నందిపాటి కళ్యాణ్,కుర్రి వెంకన్న,అప్పికట్ల అశోక్,పంగా గోపి,చిలక పిచ్చయ్య,చిలక జానయ్య,వెంకటయ్య,జానకిరాములు,ప్రభు,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.