తుంగతుర్తి,జులై 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు త్యాగశీలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం,తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాంబాబు నాగారం మండల వివిధ గ్రామాలలో సమస్యలపై ప్రశ్నించడం జరుగుతుంది.దీనిలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలోని పేరబోయిన గూడెం నుండి వందలాది లారీల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం.అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ప్రజల పైన కేసులు పెట్టి బెదిరించడం జరుగుతుంది.వందలాది లారీలు ద్వారా ఇసుక రవాణా చేయడం వల్ల పేర బోయిన గూడెం రోడ్డు అంతా అస్తవ్యస్తంగా మారడం జరిగింది.వందలాది లారీల ద్వారా ఇసుక తరలించడం వల్ల భూసారం దెబ్బ తినడం జరుగుతుంది. రైతులకు పంట నష్ట జరగడం. నీరు నిలవలేక పోవడం వలన బోర్లు ఎండిపోవడం జరుగుతుంది.అక్రమ ఇసుక రవాణాను ఆపాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది.తక్షణమే అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే నాగారం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు మరియు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పేద ప్రజలపై కేసులు పెట్టడం సబబు కాదు:ఎర్ర రాంబాబు
RELATED ARTICLES