అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత..
ఇంట్లో నిల్వ ఉంచిన 26 బస్తాల రేషన్ బియ్యం
కోదాడ,జూలై 25
(Mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం తెల్లవారుజామున కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గణేష్ నగర్ చెందిన వాకా కుటుంబరెడ్డి ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఎనిమిది రూపాయలకు కొని పదిహేను రూపాయలకు ఆంధ్రాలో అమ్మేందుకు అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచడంతో పక్కా సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు 26 బస్తాలు(13 క్వింటాల రేషన్) పట్టుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.