కోదాడ,జూన్26 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీలలో యూనియన్లకు,రాజాకీయాలకు సంబంధం లేకుండా అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి విలేకరి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకోవచ్చని జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు.సోమవారం కోదాడ పట్టణ మార్కెట్ గెస్ట్ హౌస్ కార్యాలయంలో కోదాడ నిర్వహించిన జర్నలిస్టుల కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత మొట్ట మొదటిగా రాష్ట్రంలో ఏర్పాడిన నూతన హౌసింగ్ సోసైటీ కోదాడ జర్నలిస్టులదే అని చెప్పారు.సొసైటీ లో పార్టీలకు,యూనియన్లకు అతీతంగా అక్రిడేషన్ కలిగి ఉన్న వర్కింగ్ జరలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు.జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం శ్రేయస్సు కోసం సొసైటీ ఏర్పాటు చేసామన్నారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు పడిశాల రఘు,కార్యదర్శి శ్రీనివాస రావు,సీనియర్ జర్నలిస్టు హరికిషన్ రావు,డైరెక్టర్లు పల్లా రామకృష్ణ,మల్లికార్జున్,పూర్ణచందర్,కుడుముల సైదులు,షేక్ నజీర్,లక్ష్మణ్,రమేష్,శ్రీకాంత్,లక్ష్మీనారాయణ,గోపాలకృష్ణ,వెంకన్న,లింగయ్య,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి విలేకరి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకోవచ్చు:కారింగుల అంజన్ గౌడ్
RELATED ARTICLES