అటల్ బీహార్ వాజ్పేయి ఏడవ వర్ధంతి
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 16 (ప్రతినిది మాతంగి సురేష్): పట్టణంలో డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ నివాసంలో అటల్ బీహార్ వాజ్పేయి ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బిజెపి నాయకులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అటల్ బీహార్ వాజ్పేయి అని కొనియాడారు.1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.

1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించిందని అన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించిందని అన్నారు.ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, రాష్ట్ర నాయకురాలు నూనె సులోచన, రాష్ట్ర నాయకులు బోలిశెట్టి కృష్ణయ్య, కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, జిల్లా నాయకులు కట్కోజు నాగేంద్ర చారి, ఓరుగంటి పురుషోత్తం, మండల అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు రాధాకృష్ణ, జల్లా జనార్దన్, సుధాకర్ రెడ్డి, చిలుకూరు మండలం ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, మల్లెబోయిన వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.



