ఉమ్మడి నల్లగొండ జిల్లా పై చవతి తల్లి ప్రేమ చూపిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రెవెన్యూ,పోలీస్,ఇరిగేషన్ శాఖల పహారా మధ్య ఖమ్మం జిల్లాకు నీళ్లు తరలించడం హేయమైన చర్య.
వాయిల సింగారం చెరువును పరిశీలించిన బిజెపి రాష్ట్ర నాయకులు డా,, అంజి యాదవ్.
కోదాడ,ఏప్రిల్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్::నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు రెవెన్యూ,ఇరిగేషన్,భారీ పోలీసు బలగాల మధ్య నీటిని తరలించడం దుర్మార్గమైన చర్య అని బిజెపి రాష్ట్ర నాయకులు డా,, అంజి యాదవ్ అన్నారు.సోమవారం అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారం చెరువును బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మొదట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు త్రాగునీరు లేక పల్లెల్లో ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కి ఇబ్బంది పడుతున్నారు,మరొకవైపు మూగజీవాలు సైతం నీటి కోసం తహతహలాడుతుంటే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెదపకపోవడం ఏమిటని ఆయన అన్నారు.కోదాడ (పెద్ద చెరువు అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి)హుజూర్నగర్ రెండు నియోజకవర్గాలు తమకు రెండు కళ్ళు అని,ఈ ప్రాంత ప్రజలు తమ బిడ్డలతో సమానమని ఎన్నికల సమయంలో నమ్మబలికి ఇప్పుడు నీటి కరువు తాండవిస్తుంటే కనీసం నియోజకవర్గం ఎలా ఉన్నాయని పట్టించుకోకుండా హైదరాబాదులోనే ఉంటూ వారు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలకు నీరు అందించకుండా అక్రమ మార్గంలో ఖమ్మం పాలేరు రిజర్వాయర్ కి నీటిని తరలిస్తున్నారు,సూర్యపేట జిల్లాలో పెద్ద మొత్తంలో రైతులు పంటలు ఎండిపోయి నష్టాలను చవిచూశారు అప్పుడు కూడా ఉత్తంమ్ కుమార్ రెడ్డి నోరు మెదపలేదని అన్నారు.దాదాపుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మొండి చూపించి మూడు దఫాలు పాలేరు రిజర్వాయర్ కి నీటిని తరలించడం జరిగిందని తెలిపారు.తక్షణమే నల్లగొండ,నాగార్జునసాగర్,సూర్యాపేట,కోదాడ,హుజూర్ నగర్ ప్రాంతాలలో ఉన్నటువంటి రిజర్వాయర్లను,చెరువులను,కుంటలను తక్షణమే నింపాలి లేనియెడల ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సోషల్ మీడియా మరియు హైటెక్ ప్రచారం ఇన్చార్జ్ వంగవీటి శ్రీనివాస రావు,మండల అధ్యక్షుడు వెంకటేష్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పగిడి రామారావు,రాజశేఖర్,కతిమాల వెంకన్న,వాయల సింగారం భూత్ అధ్యక్షులు శీలం సైదులు,దాసరి పుల్లయ్య,బుర్ర వెంకటేశ్వర్లు,గుంజ నవీన్,సాయి,గోపి,చంటి,పవన్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.



