అడ్డగోలుగా వార్డుల ఓట్లు.
:వార్డులు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.!
Mbmtelugunews//కోదాడ, జనవరి 03(ప్రతినిధి మాతంగి సురేష్): గతంలో కోదాడ పట్టణ పరిధిలోగల వార్డుల మాదిరిగా కాకుండా ఓట్లు పెంచి వార్డుల్ని ఏర్పరిచారు.గతంలో వార్డులో లేని ఓట్లు, ఎక్కడో ఉన్న వీధుల్లోని ఓట్లు చేర్చడంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన అభివృద్ధిలో విఫలమయ్యే అవకాశం ఉంది. పట్టణ పరిది పెరగడంతో ఓట్లు పెరిగాయి, కాబట్టి రెండు మూడు వార్డుల్ని అదనంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వార్డు పరిధి ఒకచోట ఉంటే, కోదాడ పట్టణంలోని మిగతా వీధుల్లోని వార్డుల్లోని ఓట్లు కలపడంతో అడ్డగోలుగా విడిపోయాయి. ఇది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడమే అవుతుంది. కనుక ఓట్లు సవరించి 1600, 1700 ఓట్లతో వార్డులను కుదించాల్సిన ఆవశ్యకత ను అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్ తెలిపారు.



