అడ్లూరు లో ఆగని పాత కక్షలు
:సర్పంచి మామ చేతులు ఇరగొట్టిన ఉప సర్పంచ్ వర్గీయులు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 01: సర్పంచి మామని రాత్రిపూట రోడ్డు వెంట కాపు కాసి కళ్ళల్లో కారం కొట్టి రాడ్లు కర్రలతో కొట్టి చేతులు విరగగొట్టిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని అడ్లూరు పునరావాస కేంద్రంలో మార్చి 29 నా గ్రామ సభలు లో జరిగిన గొడవలను మనసులో పెట్టుకొని అదే గ్రామానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఉప సర్పంచి భర్త, వారి వార్డు మెంబర్ ఇతరులు కలిసి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచి మామని రాత్రిపూట రోడ్డు వెంట కాపు కాసి కళ్ళల్లో కారం కొట్టి రాడ్లు కర్రలతో కొట్టి చేతులు విరగగొట్టినారని అత్యవసర వైద్యం నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని బాధితుని కుమారుడు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దర్నీ అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



