అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే ..
:పూలే ఆశయాలను సాధించాలి…..
:మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు..
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ మునిసిపల్ కార్యాలయం లో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు. అనంతరం ఆమె మాట్లాడుతూ పూలే మహిళా విద్యకు,సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మహనీయుడన్నారు. సంఘ సంస్కర్త గా నాడు సమాజం లో ఉన్న రుగ్మతలను రూపు మాపడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగ శీలి అన్నారు. పూలే అభ్యుదయ భావాల తోనే సమాజ చైతన్యం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ లు సిబ్బంది ఉన్నారు.



