Monday, December 23, 2024
[t4b-ticker]

అధర్మ చక్రవర్తి కి మారు పేర్లు….

- Advertisment -spot_img

అధర్మ చక్రవర్తి కి మారు పేర్లు….

:కంత్రీ కాకానీ…

:కల్తీ కాకానీ…

:కాలుష్య కాకానీ…

:ఇంకోక క ఉంది అది మరలా చెప్తా….

Mbmtelugunews//నెల్లూరు జిల్లా, అక్టోబర్ 03:సనాతన ధర్మం అంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కి తొంగి చూడడం కాదు తరతరాలుగా వస్తున్న హిందూ ఆచారాలను కాపాడటం అని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు.డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నెల్లూరు నాయకులు,గీతా వైభవ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నగర సంకీర్తన నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసిపీ ప్రభుత్వం లో హిందూ దేవాలయాల దాడులు పెరిగాయి హిందూ ధర్మ పరిరక్షణార్థం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పరచాలని… అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 11 రోజులుగా చేస్తున్న దీక్ష ఈ రోజు పూర్తి అయింది..దానికి మద్దతుగా ఈ రోజు గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్,వారి భక్త బృందం,జనసేన నాయకులు సంయుక్తంగా ఈ నగర సంకీర్తన చేయడం జరిగింది..నిన్నటి రోజున హిందూ సనాతన ధర్మం గురించి ఒక అధర్మ చక్రవర్తి మాట్లాడడం విడ్డూరంగా అనిపించింది…వారికి పలు పేర్లు ఉన్నాయి కల్తీ కాకాని… కంత్రీ కాకాని..కాలుష్య కాకాని… ఇంకో క ఉంది దాన్ని మరలా తర్వాత మాట్లాడుకుందాం…కల్తీ మద్యం తాగించి పేదల ప్రాణాలతో ఆడుకున్న కాకాని కల్తీ మద్యం కాకానీ అని పేరుంది…న్యాయదేవతను సైతం లెక్కచేయకుండా కోర్టు ఆవరణలో తన ఫైలు మాత్రమే దొంగలించబడి కంత్రీ కాకాని అని ప్రజలు అనుకుంటున్నారు…సర్వేపల్లి నియోజకవర్గం లో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకుండా పరిశ్రమలు పెట్టించి పేదలకు పునరావాసాలు ఏర్పరచకుండా… తన నివాసాన్ని మాత్రం నెల్లూరులో సేఫ్గా ఏర్పరచుకున్నందుకు కాలుష్య కాకాని అయ్యారు.ఇకపోతే విచ్చలవిడిగా మైనింగ్ దోచుకుంటుంటే అడ్డుపడిన ప్రజాప్రతినిధులపై ఎవరిని పంపారు ఆ క దానికి వదిలేసాను…సనాతన ధర్మం అంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కి తొంగి చూడడం కాదు తరతరాలుగా వస్తున్న హిందూ ఆచారాలను కాపాడటం అని తెలిపారు….03.10.2024 రేపటి రోజున తిరుపతిలో జరగనున్న వారాహి సభకి రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు తరలివచ్చి హిందూ సోదరులకు పవన్ కళ్యాణ్ చే మెసేజ్ ని తీసుకోవాల్సిందిగా స్వాగతిస్తున్నాం….

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular