అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన
టీఎన్జీవో యూనియన్ నాయకులు.
Mbmtelugunews//కోదాడ,జనవరి 03(ప్రతినిధి మాతంగి సురేష్): ఆర్డీవో సూర్యనారాయణ, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, వెటర్నరీ ఏడి డాక్టర్ పెంటయ్య, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఏటీవో షరీఫ్ బాబా, ఎస్టిఓ బి శ్రీనివాసరావు ,పట్టణ సీఐ శివశంకర్, ఎంపీడీవో ఇస్సాక్ హుస్సేన్, ఎమ్మార్వో వాజిద్ అలీ, డాక్టర్ సురేంద్రబాబు లను టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు శనివారం కలిసి పుష్పగుచ్చలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

జనవరి 1న రాష్ట్ర పోలీస్ సేవా పథకానికి ఎంపికైనందుకు డిఎస్పికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు…అందరి అధికారుల భాగస్వామ్యంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిత్తలూరి పద్మ, కోశాధికారి రాధిక, జనరల్ సెక్రెటరీ రమాదేవి, ఆర్గనైజేషన్ సెక్రటరీ విక్రమ్, యూనియన్ సభ్యులు మమత, అక్షయ తేజ, అన్వేష్, నసిమా, లతీమున్, హరికృష్ణ,
సైదులు, ప్రభాకర్, బాలకృష్ణ,
పులి శీను, బలరాం నాయక్, డాక్టర్ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.



