కోదాడ,జూన్ 17(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎన్ఐటి,ఐఐటి,ఒలంపియాడ్ వంటి పలు రకాల ఫీజుల పేరుతో అయోమయానికి గురిచేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని అనంతగిరి మండల బీఎస్పీ అధ్యక్షులు నూకల గోపాల స్వామి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కోదాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివిస్తుంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారిని అనేక రకాల దోపిడీకి గురి చేయడం సిగ్గుచేటు అని,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇకనైనా తల్లిదండ్రులను అయోమయానికి గురి చేయకుండా అధిక ఫీజులు వసూలు చేయకుండా నాణ్యమైన విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కరిశ ఉపేందర్,వెంకటేశ్వర్లు,కరిశ రఘు,నారాయణ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి
RELATED ARTICLES