Monday, January 13, 2025
[t4b-ticker]

అనంతగిరి తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి

- Advertisment -spot_img

అనంతగిరి తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి

Mbmtelugunews//కోదాడ,జనవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్)వారసత్వంగా ఉన్న భూమిని కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా దొంగచాటున పట్టా చేసిన అనంతగిరి తహసిల్దార్ హిమబిందుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతగిరి మండలానికి చెందిన నెలకుర్తి ఉషారాణి కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణను కోరుతూ మంగళవారం వినతిపత్రం అందజేశారు.వివరాలకు వెళితే మండల పరిధిలోని గొండ్రియాల గ్రామానికి చెందిన నెల్లూరి వీరయ్యకు కొడుకు,కూతురు ఉన్నారు వీరయ్య గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోగా తనపై ఉన్న 12 ఎకరాల భూమిని ఆరు ఎకరాలు కూతురికి వచ్చేటట్లు వీలునామా రాశారు.అట్టి భూమిని అన్న తనకు తెలియకుండా పట్టా చేసేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడనే విషయం తెలుసుకొని డిసెంబర్ 31 వ తారీఖున తన తండ్రి ఆస్తిలో నాకు వాటా ఉంటుందని తన ప్రమేయం లేకుండా తన తండ్రి ఆస్తిని ఎవరికి పట్టా చేయవద్దని అనంతగిరి తాసిల్దార్ కు ఫిర్యాదు అందజేశారు.కాగా జనవరి 02న సదురు తహసిల్దార్ హిమబిందు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్లు నెలకుర్తి ఉషారాణిని సభ్యులుగా చేర్చి తనకు ఎలాంటి సమాచారం లేకుండా దొంగతనంగా నెల్లూరు వీరయ్య కొడుకు కొడుకుకు పట్టా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లంచానికి లాలూచి పడి వారసురాలికి సమాచారం లేకుండా చేసిన పట్టాను రద్దుచేసి తండ్రి ఆస్తిని తనకు దక్కకుండా చేసిన తహసిల్దార్ హిమబిందుపై చట్టపరమైన చర్యలు తీసుకొని తన తండ్రి ఆస్తిని తనకు అప్పగించాలని ఆర్డీవోను కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular