కోదాడ,ఏప్రిల్ 19(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు,సంక్షేమ పథకాలుకు ఆకర్షితులై అనంతగిరి మండలం నుండి 150 కుటుంబాలు భారీ నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు నలమాద పద్మావతి రెడ్డి సమక్షంలో అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన గురువారం కోదాడ పట్టణ పరిధిలోని డేగ బాబు ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్లమెంటు ప్రచార ప్రారంభ సభలో బిఆర్ఎస్ పార్టీ వీడి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఇట్టి నూతన చేరికలు ఖానాపురం మాజీ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు,మాజీ సర్పంచ్ గింజపల్లి రఘు పార్టీలో చేరుతూ వీరి ఆధ్వర్యంలో 60 కుటుంబాలు,పాలారం గ్రామం నుండి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్,వసంతపురం నుండి హనుమంతు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 60 కుటుంబాలు, చనుపల్లి నుండి 30 కుటుంబాలు,పాత కొత్త గోల్ తండాల నుండి పలు కుటుంబాలు,వాయిల సింగారం నుండి పలువురు చేరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,ఎంపీపీ చుండూరి వెంకటేశ్వరరావు,జెడ్పిటిసి ఉమా శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గునుకుల గోపాల్ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు నాయక్,మండల నాయకులు డేగ కొండయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ కి 9666358480 కి పంపించగలరు



