అనాధాలకు అన్నదానం
Mbmtelugunews//కోదాడ,మే 12(ప్రతినిధి మాతంగి సురేష్):గుండెపోటుతో మరణించిన మాజీ ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు,కూరగాయల మార్కెట్ ఆటో యూనియన్ నాయకులు కేసగాని వీరబాబు పెద్ద ఖర్మ సందర్భంగా వారి జ్ఞాపకార్ధం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శనగల రాధాకృష్ణ అనాధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు,బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు,న్యాయవాది ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ కేసగాని వీరబాబు విద్యార్థి దశ నుండి అభ్యుదయ భావాలు కలిగి ఉన్నాడని,కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా జీవిస్తూ,కూరగాయల మార్కెట్ లో అందరికీ తలలో నాలుక లెక్క వుంటూ,గోల్డెన్ సిటీ వాసిగా అక్కడ వారిలో అనతికాలంలోనే అందరి అభిమానాలను చురగొన్నారు,అలాంటి మంచి వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించడం అందరికీ,ఆయన కుటుంబానికి తీవ్రమైన లోటు అన్నారు.కేసగాని వీరబాబు చిన్నతనం నుండి కష్టపడుతూ నలుగురికి సహాయం చేస్తూ తన జీవితాన్ని ఆదర్శంగా కొనసాగిస్తూ నేడు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు.అతని ఆత్మ శాంతి కోసం వారి కుటుంబ సభ్యులు,స్నేహితులు ఈ రోజు శనగల రాధాకృష్ణ అనాధాశ్రమం లో అనాధ పిల్లల కు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అతని సోదరులు కె వీరేందర్,కె నరేష్,కె శ్రీకాంత్,స్నేహితులు సురేష్,కుమార్,వీక్షిత్,బాబు,శ్రీను,నరేష్,శ్రీకాంత్,మురళి,షఫీ తదితరులు పాల్గొన్నారు.