అనుమతిలు లేని న్యూ విజన్ ది నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ని తక్షణమే మూసివేయాలి:కేశబోయిన మురళీకృష్ణ
కోదాడ,జూన్ 27(mbmtelugunewd) మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని న్యూ విజన్ ది నెక్స్ట్ జనరేషన్ స్కూలు తక్షణమే మూసివేయాలని పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్
(టిఎస్ఏ)రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆదేశాల మేరకు టిఎస్ఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,సూర్యాపేట జిల్లా ఇన్చార్జి మురళీకృష్ణ అధ్యక్షతన పలు విద్యార్థి సంఘాలు పాఠశాల ఆవరణంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేశబోయిన మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా బుక్స్ యూనిఫార్మ్స్ అమ్ముచున్నారు.అంతే కాకుండా మా పాఠశాలలో సిబిఎస్ సిలబస్ కలదని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అత్యధిక ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. ఈ పాఠశాలకు సిబిఎస్ సిలబస్ కు అనుమతి లేదని కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. పాఠశాల అనుమతులన్నీ న్యూ విజన్ తో ఉంటాయి కానీ విద్యార్థులకు అమ్మే బుక్స్,కోట్,టై బెల్టు,యూనిఫామ్ ఇతరత్రా అన్ని ఏకశిలా పాఠశాల పేరు మీద ముద్రించి విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు.కావున అలాంటి పాఠశాలలను తక్షణమే మూసివేయాలని పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నాయి.

విషయాన్ని తెలుసుకున్న ఎంఈఓ సలీం షరీఫ్ పాఠశాలకు చేరుకొని బుక్స్,యూనిఫామ్ అమ్ముతున్న రూమ్ లకు తాళాలు తీయించి రూములలో ఉన్న బుక్స్ యూనిఫార్మ్స్ ఇతరత్రా వాటిని పరిశీలించి వీటిని ఎలాంటి విక్రయాలు జరపవద్దని రెండు రూములకు తాళాలు వేసి సీల్ వేసి సీజ్ చేసినారు.ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మేకల వీరబాబు,కాసాని వెంకటేష్,మేకల వీరేష్,పందిటి నవీన్ కుమార్,గుండా రామిరెడ్డి,నమృత్ లు పాల్గొనడం జరిగింది.