అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం
కోదాడ,మే 02(mbmtelugunewd)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలో ని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర్యంలోని అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకొని ఆస్పత్రులు నిర్వహించుకోవాలని, అనుమతులు లేని ఆసుపత్రులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం కటకమ్మ గూడెం రోడ్డులోని నవీన్ హాస్పిటల్,డాక్టర్ సుబ్బారావు హాస్పిటల్ ఎదురుగా గల శ్రీ హృదయ హాస్పిటల్ ల రికార్డులు పరిశీలించి సీజ్ చేసామని తెలిపారు.

పూర్తిస్థాయి అర్హత పత్రాలు సమర్పించేంత వరకు ఆసుపత్రిని మూసి వేయనున్నట్లు తెలియజేశారు.వైద్యులు తమ అర్హతలను,రిజిస్ట్రేషన్ నెంబర్లను విధిగా ప్రదర్శించాలని,తప్పుడు ద్రువ పత్రాలు,అర్హత పత్రాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎప్పటికప్పుడు వ్యాధులను నిర్ధారించి ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ చేయాలని,దీనికి సంబంధించి ఇటీవల శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

తనిఖీలు నిర్వహించిన అధికారుల బృందంలో డాక్టర్ నిరంజన్,డాక్టర్ వెంకటరమణ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,అంజయ్య తదితరులు ఉన్నారు.
మీ ప్రాంతంలో సమాచారం ఏమైనా ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



