అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో తలసేమియా,సికిల్ సెల్ సొసైటి ఖమ్మం వారి ద్వారా స్థానిక అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్యర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి సురేష్ కుమార్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వేంకటేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమానికి సొసైటీ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,వైద్య సిబ్బంది నరేష్,సన్నీ,రఘు,గోవర్ధన్,రమా,మనీషా గ్లో సహకార పర్యవేక్షణలో 125 మంది విద్యార్థినీ విద్యార్థులు రక్తదాన శిభారంలో పాల్గని రక్తదానం చేసారు.ఈ తరహాలో సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడే వారికి అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు.ఈ స్వచ్చంద సమాజ సేవా ధృక్పథంలో మేయున్నామని రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు.అనంతరం ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ కూడా ఇస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నప్పుడల్లా సమాజ సేవలో ముందుండాలని,విద్యార్థి దశనుండి అలవరుచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధులు కె జైపాల్ రెడ్డి,పాండురంగ ప్రసాద్,భూపతిరావు,వివిధ విభాగాల అధిపతులు డిప్లొమా విద్యార్థినీ,విద్యార్థులు,ఇంజనీరింగ్ విద్యార్థినీ,విద్యార్థులు బోధన బోధ నేతరా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.