అన్నదానం మహాదానం
:స్వాములకు సద్ది ఏర్పాటు చేసిన విఎన్ఆర్ మిల్క్ డైరీ ప్రోడక్ట్
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 13(ప్రతినిధి మాతంగి సురేష్):అయ్యప్ప స్వామి దేవస్థానములో విఎన్ఆర్ మిల్క్ డైరీ ప్రోడక్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ అయ్యప్ప స్వాములకు అన్నదానం ఏర్పాటు చేసినారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విఎన్ఆర్ డైరీ కంపెనీ వారు పెరుగు గత మూడు సంవత్సరాలనుండి డైలీ 66 రోజులు రోజుకి 60 kg ల చెప్పున అయ్యప్ప స్వామి దేవాలయమునకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వారి సహకారం మరువలేనిదని అన్నారు.ఇట్టి కార్యక్రమములో అయ్యప్ప స్వామి టెంపుల్ అధ్యక్షుడు రేపల్లె ప్రసాద్ రావు ఉపాధ్యక్షులు దంతాల నాగయ్య,కొక్కు లక్ష్మీనారాయణ,బొలిశెట్టి కృష్ణయ్య,వెంకటేశ్వరావు,ప్రధాన కార్యదర్శి చల్లా రామ్మూర్తి,సహాయ కార్యదర్శి కేతిరెడ్డి అమృత రెడ్డి,కోశాధికారి కోట రామ్ నరసింహ రావు,సురబి నర్సయ్య,డైరెక్టర్లు,గురు స్వాములు,అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ,విఎన్ఆర్ డైరీ ఎండి మారెళ్ళ విజయ నర్సింహారెడ్డి,విఎన్ఆర్ డైరీ జిఎం చెన్నూరి సతీష్,ప్లాంట్ మేనేజర్లు సతీష్,మధు,రామంజి గౌడ్,అజితదేవి,శ్రీనివాస్,రామకృష్ణ,బ్రహ్మం,గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.