అన్నదానాలు పుణ్యకార్యాలు…
:దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి…
:బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలి..
:తిలక్ నగర్ లో మహా అన్నదానం ప్రారంభించిన మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు…
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): అన్నదానాలు పుణ్యకార్యాలని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్న తిలక్ నగర్ వాసులను అభినందించారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు మహిళలు బతుకమ్మ పండుగను ఆనందోస్తాలతో నిర్వహించుకోవాలన్నారు బతుకమ్మ పండుగ కుముందస్తు గా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు



