కోదాడ,జులై 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అన్ని దానాలలో ప్రాణదానం గొప్పదని దానికి అవయదానం చాలా గొప్ప మార్గమని ప్రముఖ సామాజిక విశ్లేషకురాలు బంగారు నాగమణి పేర్కొన్నారు. సోమవారం వాగ్దేవి జూనియర్ కాలేజీలో అవయవ దానం దాని ఆవశ్యకత గురించి జరిగిన సెమినార్ పాల్గొని మాట్లాడారు.మరణం అంచులో ఉన్న వ్యక్తిని బ్రతికించడంలో అవయవ దానం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. పురాతన విశ్వాసాలను విడనాడి మరణాంతరం కూడా తమ అవయవాలను దానం చేసి మరొకరికి పునర్జన్మ ఇవ్వవచ్చని
ఆధునిక వైద్యరంగం పురోగతి చెంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మండవ మధు,తుమ్మ భాస్కర్,కృష్ణమూర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు.
అన్ని దానాలలో అవయవ దానం గొప్పది
RELATED ARTICLES