కోదాడ,సెప్టెంబర్ 24(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:అన్నదానం మహాదానం గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం భక్తి పర్వశానికి నిదర్శనమని డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.ఆదివారం అనంతగిరి మండల కేంద్రంలో గణేష్ యూత్ బీసీ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా,, మల్లెబోయిన అంజి యాదవ్ పాల్గొని గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ యూత్ సభ్యులు ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన యూత్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ నవరాత్రి ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.

గణేష్ నిమజ్జనం సమయంలో కమిటీ వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకునేటట్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు,కొమెర శ్రీకాంత్,రాము,సాయి,బాబు,నాగరాజు,గోపి,నరేష్,శ్రీను,మహేష్ తదితరులు పాల్గొన్నారు



