కోదాడ,ఏప్రిల్ 24 (mvmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ వరవర రంగనాయక స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించినారు. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ పొట్ట విజయ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసినారు.ఈ అన్నదాన కార్యక్రమంలో అడ్వకేటు కామిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.అన్ని దానాల కన్నా మహాదానం అన్నదానం ఈ అన్నదానాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాసాని రాంబాబు,పోశం ఎర్ర కొండలు,పొట్ట ప్రసాద్,దేవాలయ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.



