అన్ని దానాల కన్నా గొప్ప దానం నేత్రదానం
:నేత్రదానంతో మరొకరు ఈ లోకం చూడవచ్చు:పద్మనాభం
Mbmtelugunews//కోదాడ,మే 31: అన్ని దానాల కంటే నేత్రదానం గొప్పదని చనిపోయిన వ్యక్తి యొక్క కళ్ళను నేత్రదానం చేయడం వలన మరొకరికి ఈ లోకం చూసే గొప్ప వరమని ఖమ్మం నేత్ర నిధి సెక్రటరీ అర్ఐ పద్మనాభం అన్నారు.కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక తమ్మర బండపాలెం నాలుగో వార్డులో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు బచ్చలకూర జార్జి శనివారం అనారోగ్య కారణాల వలన మరణించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కుమారుడు బచ్చలకూరి మృత్యుంజయ,కుమార్తెలు చైతన్య,కల్పన,ప్రతిభలు తన తండ్రి నేత్రాలను దానం చేయటానికి ఒప్పుకోవటంతో జార్జి నేత్రాలను సేకరించి నేత్ర నిధికి తరలించారు.

అనంతరం పద్మనాభం మాట్లాడుతూ మృతుడు జార్జి కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.లోకంలో కళ్ళు లేక చూపు కోల్పోయిన ఎందరికో లోకం చూడడానికి చనిపోయిన వారి నేత్రాలను దాతలు దానం చేయటం వలన వారికి కొత్త జన్మనిచ్చిన వారవుతారని తెలిపారు.