అబ్బురపరిచిన కుక్క కంటి ఆపరేషన్
:కండరాలతో సహా బైటకు పొడుచుకు వచ్చిన కుక్క కనుగుడ్డుకు శస్త్ర చికిత్స
:కుక్క తలపై ఇనుపరాడ్డుతో కొడితే బైటకు పొడుచుకు వచ్చిన కను గుడ్డు
:చూపులేక నొప్పితో విలవిలలాడుతూ రోజంతా పారిపోయిన కుక్క
:కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అరుదైన శస్త్ర చికిత్సతో కనుగుడ్డు యథాస్థితికి
Mbmtelugunews//జూన్ 05(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మండల పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన ఒక కుక్క యజమాని అది తన కంట్రోల్ లో ఉండడం లేదనే కోపం తో ఇనుపరాడ్డుతో తలపై బాదడం తో ఎడమ కన్ను గుడ్డు కండరాలతో సహా బైటకు వచ్చింది.కుక్క భయంతో పారిపోయి ఒకరోజు తరువాత వేలాడబడి ఉన్న కనుగుడ్డుతో ఇంటికి రాగా వైద్యం నిమిత్తం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకొచ్చారు.
కనుగుడ్డు పూర్తిగా బైటకు వచ్చి ఒకరోజు గడవడం చుట్టూ చెత్త చెదారం మట్టి అంటుకొని కనుపాప కూడా కనిపించకపోవడం అంత్యంత భయానక స్థితిలో ఉన్న కుక్కను అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య పరీక్షించి బైటకు పొడుచుకు వచ్చిన కనుగుడ్డుకు ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ జనరల్ అనస్థేసియా ద్వారా కుక్కను నిద్రపుచ్చి కంటిని శుభ్రపరచి శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా కనుగుడ్డును తిరిగి యథాస్థితిలో లోనికి పంపి కుక్క శాశ్వత అంధత్వం పొందకుండా కాపాడారు.వారం తరువాత కనుగుడ్డు లోపల సర్దుకున్నాక కుట్లు తీయడం జరుగుతుందని చూపు కూడా యదా విధిగా ఉంటుంది అని ఈ వారం రోజులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఆవేశం లో కొట్టినా కుక్క పరిస్థితి చూసి తట్టుకోలేక కన్నుపోయినా పర్లేదు తన కుక్క ప్రాణాలతో ఉంటే చాలని ఆపరేషన్ చేయించిన యజమాని కన్ను కూడా తిరిగి వస్తుందనే ఆశతో తన సంతోషం వెలిబుచ్చారు.ఆపరేషన్ లో కాపుగల్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సురేందర్,సిబ్బంది రాజు,అఖిల్ పాల్గొన్నారు.