అమరవీరుల త్యాగాలు మరువలేనివి: వేపూరి తిరుపతమ్మ సుధీర్
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15(ప్రతినిధి మాతంగి సురేష్): భారత స్వతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ జెండాను ఎగరవేసి ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే మనకు తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటు జరిగిందన్నసత్యా న్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉంది.మనం చేసేది పోరాటం,మనం తెచ్చేది స్వా తంత్ర్యం అది మన జన్మహక్కు అ ని చెప్పిన మహా కవి దాశరథి మా టలను నిజం చేస్తూ దశాబ్ధాల ఉ మ్మడి పాలనకు విముక్తి కల్పిస్తూ మన పోరాటాన్ని గౌరవిస్తూ సో నియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రా ష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘట్టంలో సోని యా గాంధీకి ఎన్ని ఇబ్బందులు, ఆ టంకాలు ఎదురయ్యాయో మీకం దరికి తెలిసిందే. అయినప్పటికి త ల్లిమనసుతో మన పోరాటాన్ని అ ర్ధం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సారథ్యంలో మార్కెట్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేస్ చైర్మన్ బషీర్, మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, సత్య బాబు, డైరెక్టర్లు వీరబాబు, సూర్యం, వెంకటరెడ్డి, శ్రీను, శ్రీనివాస్, మనేమ్మ, సెలక్షన్ గ్రేడ్ వన్ సెక్రటరీ రాహుల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



