కోదాడ,జనవరి 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని గుంటి రఘునాథ స్వామి దేవాలయంలో గురువారం అయోధ్య రామ మందిరం పూజిత అక్షింతలు పూజా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం నయానగర్ లోగడపగడపకు అక్షంతల వితరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈనెల 22న అయోధ్య లో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట అనంతరం ప్రతి ఇంట్లో మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల సమయంలో 5 దీపాలు వెలిగించి అక్షంతలను తలపై వేసుకోవాలని రామభక్తులు సూచించారు.ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కృష్ణయ్య,నూనె సులోచన,పబ్బా గీతా,దేవి,కె వాసవి,జి పుష్పావతి,పి సుహాసిని,ఏ అన్నపూర్ణ,ఎం పాపారాణి,వి వాణి,అన్నపూర్ణ,సిహెచ్ ఝాన్సీ,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



