అయ్యప్ప స్వాములకు అన్నదానం…
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్):అయ్యప్ప స్వాములకు గత 10 సంవత్సరాలుగా నిత్యాన్నదానంలో భాగంగా సన్నిధానంలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ నాయకులు గాలి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర,తెలంగాణ బోర్డర్,మూడు జిల్లాల సరిహద్దు,కోదాడ పట్టణంలో వివిధ ప్రాంతాల నుండి పని నిమిత్తం వచ్చే స్వాముల ఆకలి తీర్చాలి అనే సంకల్పంతో గాలి శ్రీనివాస్ నాయుడు వారి సోదరుడు గాలి రమేష్ నాయుడు పేరు మీద గత 10 సంవత్సరాల నుండి అయ్యప్ప,శివ,వెంకటేశ్వర స్వామి,సకల దీక్ష స్వాములకు ప్రతి సంవత్సరం సుమారు 40 నుండీ 50 వేల మంది స్వాములకు అన్నదానం చెయ్యడం జరుగుతుంది అని శ్రీనివాస్ నాయుడు తెలిపినారు.ఇది 11వ సంవత్సరం మొదటి రోజు ఈరోజు అన్నదానానికి 400 మంది స్వాములు పాల్గొన్నారని స్వాములకు అన్నదాతలుగా ఓరుగంటి రాంప్రసాద్,మాధవి దంపతులు అన్నదాతలుగా వ్యవరించారని తెలిపారు.స్వాములందరూ ప్రతిరోజు అన్నప్రసాదాలను స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు,సూర్య రెడ్డి,బిఎస్ఎన్ఎల్ శేఖర్,పలువురు పుర ప్రముఖులు,స్వాములు తదితరులు పాల్గొన్నారు.