చేసేదే చెప్తాం-చెప్పిందె చేస్తాం
:ఇచ్చిన మాటకు కట్టుబడి స్వాతంత్ర్య భారతదేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఒకేసారి 2 లక్షల రైతు రుణ మాఫి చేసినాము…..
:రైతన్నలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు…
:అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణ మాఫి వర్తింపు……
నీటి పారుదల,ఆయకట్టు అభివృద్ధి,ఆహారం మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 17:చేసేదే చెప్తాం -చెప్పిందే చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి స్వాతంత్ర్య భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతులకు 2 లక్షల రుణ మాఫి చేసి చూపించాం అని రాష్ట్ర నీటి పారుదల,ఆయకట్టు అభివృద్ధి,ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం కోదాడ లో కాశినాధం పంక్షన్ హాల్ నందు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలకి సంబంధించి రెండు లక్షల రైతు రుణ మాఫి పై రైతులకి సందేహాలను నివృత్తి చేయుటకు నిర్వహించిన సమావేశం లో కోదాడ శాసన సభ సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పాల్గొన్నారు.ఎవరికైనా రుణ మాఫి కాకపొతే సంబంధిత ఏఈఓ లను,మండల వ్యవసాయ అధికార్లను కలిసి మీ ఆధార్ కార్డు నెంబర్లు ఇచ్చి పరిశీలించుకోవాలని మంత్రి తెలిపారు.2 లక్షల రుణం వరకు రైతుల పక్షాన ప్రభుత్వమే బ్యాంక్ లకు కడుతుందని,2 లక్షల కి ఎక్కువ రుణం ఉంటే ఎక్కువ ఉన్నది రైతు కట్టిన వెంటనే ప్రభుత్వం 2 లక్షలు బ్యాంక్ లో వేస్తుందని,రుణ మాఫి కానీ వారు,రెండు లక్షల పైన ఉన్న వారు ఏమైనా సందేహాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ని చూసుకొని అధికారులను కలవాలని మంత్రి తెలిపారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫి చేస్తాం అని ఎ రైతు అధైర్య పడవద్దని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో 3 విడుతలలో ఎవరికైనా రుణ మాఫి కాకపోతే క్లస్టర్ లో ఏఈఓ లు,మండలంలో ఏఓ లు అందుబాటులో ఉంటారని వారికి లాగిన్ లు ఇవ్వటం జరిగిందని మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పితే సంబంధిత లోన్ వివరాలు తెలియపరుస్తారని అవసరం అయితే ప్రింట్ కూడా ఇస్తారని కలెక్టర్ తెలిపారు.రుణ మాఫి వ్యక్తుల వివరాలు తప్పుగా నమోదు అయి ఉంటే వారికి మాఫి కాలేదని వాటిని సరిచేసుకోవచ్చు అని కలెక్టర్ అన్నారు.కొంత మంది రైతుల వివరాలు నమోదు కాలేదని,ఆధార్ కార్డు నెంబర్లు తప్పు ఉన్న,ఆధార్ కార్డు లో పేరు అలాగే పాస్ బుక్ లో పేర్లు తప్పు ఉంటే వివరాలు సరిగ్గా జతపడలేదని చూపిస్తుందని అలాంటి వారు పేర్లు సరి చేసుకొని వ్యవసాయ అధికారులను కలిస్తే వారి లాగిన్ లో రుణ మాఫి కి అప్లై చేయవచ్చు అని కలెక్టర్ తెలిపారు.రేషన్ కార్డు లేని వారు వ్యవసాయ అధికారులను కలిస్తే వారే మీ ఇంటికి వచ్చి మీ కుటుంబానికి సంబందించిన ఆధార్ కార్డు నెంబర్లు తీసుకొని వారి లాగిన్ ద్వారా వారి లోన్ వివరాలను పరిశీలించి ఒక కుటుంబంగా పరిగణించి కుటుంబానికి 2 లక్షల వరకు రుణ మాఫి చేయటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణ మాఫి చేయటం జరుగుతుందని,తదుపరి రైతులు రుణమాఫి కి సంబందించిన పలు సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇస్తు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.ఇంకా ఏమైనా రుణ మాఫి కి సంబంధించి సందేహాలు ఉంటే జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక పంపిస్తారని వారి చూచనలతో తదుపరి రుణ మాఫి చేయటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల వ్యవసాయ అధికారులు,రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.