కోదాడ,అక్టోబర్ 02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఐజేయు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి కోరారు.ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం కోదాడలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు.ధర్నా అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని,వారందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు,అలాగే జర్నలిస్టులపై అక్రమ కేసులను పెట్టేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.ఈ ధర్నాలో యూనియన్ సభ్యులు బాదే రాము,సలిగంటి మురళి,పల్లపు శ్రీనివాస్,లంకెల దశరధ రెడ్డి,కోటా రాంబాబు,పడిశాల నాగరాజు,మోహన్,సలిగంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి:ఐజేయు ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి
RELATED ARTICLES



