తుంగతుర్తి,సెప్టెంబర్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అధికార పార్టీ నాయకులకు,కార్యకర్తలకే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు,బీసీ బందు అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాంబాబు అన్నారు.బహుజన సమాజ్ పార్టీ నాగారం మండల అధ్యక్షులు ఈదుల యాదగిరి ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వచించినారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్ర రాంబాబు (రావణ్)పాల్గొని మాట్లాడుతూ నాగారం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు రెండవ విడత దళిత బంధు మరియు బీసీ బందులు ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరియు నాగారం మండల పార్టీ అధ్యక్షులు చెప్పిన వరకే వారి పార్టీ నాయకులకు ఇవ్వడం జరుగుతుంది అని ప్రజల వాపోతున్నారన్నారు.ఎమ్మెల్యేలకు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు దళిత బందుతో ఎలాంటి సంబంధం లేదని,ఇది ప్రభుత్వ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోర్టు నుండి తీర్పు రావడం జరిగిందన్నారు.ఎమ్మెల్యే చెప్పిన వారికే ఎస్సీ కార్పొరేషన్ నిధులు,కాంట్రాక్టులు,దళిత బంధు,బీసీ బందులు దళిత బంధు మరియు బీసీ బందు మరియు గృహలక్ష్మి పథకాల పేరుతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టూ మరియు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇండ్ల చుట్టూ సామాన్య ప్రజలను తిప్పుకుంటూ వాళ్లను ప్రలోభ పెట్టి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారన్నారు.బీసీ బందు గాని దళిత బందు గాని పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి నిరుపేద కుటుంబాలకు అందే విధంగా ప్రభుత్వ పథకం అమలు జరగాలని బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. లేనియెడల మా అధినాయకుడు బహుజనుల ఆశాజ్యోతి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశానుసారము భారీ నిరసనలు తెలియజేసి నాగారం మండల కేంద్రంలో రిలే దీక్షలు కూర్చుంటామని తెలియజేస్తు ఎమ్మార్వోకి మరియు ఎంపీడీవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల కార్యదర్శిలు అందే బాలరాజు,తాండోజు వెంకన్న,శేఖరు,ఎలేందర్ సైదులు,నాగరాజు,యాకోబు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు బీసీ బందు పథకాన్ని అమలు చేయాలి:ఎర్ర రాంబాబు
RELATED ARTICLES



