అల్వాలపురం,తమ్మర, అశోక్ నగర్,బండపాలెం,గొండ్రియల గ్రామాలను చుట్టుముట్టిన బైపాస్.
:దుర్గాపురం బైపాస్ నుండి బండపాలెం బ్రిడ్జి వరకు సర్వీస్ రోడ్డు నిర్మించాలి.
:సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రైతులకు తీవ్ర ఇబ్బంది.
:ఎంతో ప్రసిద్ధి చెందిన బండపాలెం శ్రీదేవల్ బాలాజీ దేవాలయం మరుగున పడే పరిస్థితి.
:సర్వీస్ రోడ్డు లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.
కోదాడ,జూన్ 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండలంలోని తమ్మర,బండపాలెం,అల్వాలపురం, అశోక్ నగర్,దుర్గాపురం గ్రామాల పరిధిలోని రైతులందరు బైపాస్ రోడ్డుకు పొలాలను అక్కడ పంట పండించుకునే రైతులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రైతులు అయినప్పటికీ పొలాలకు మంచి రేటు వస్తుందని బైపాస్ రోడ్డుకి వారి పొలాలను తక్కువ రేట్ కి త్యాగం చేస్తే అదే రైతులు వారి పొలాలకు వెళ్లడానికి ఈరోజు సర్వీసులు రోడ్డు లేకపోవడం వలన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందనిదీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల రైతులు గురువారం బైపాస్ పై రైతులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సామినేని రమేష్ మాట్లాడుతూ దుర్గాపురం బైపాస్ నుండి ఖమ్మం రోడ్డు వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు మా యొక్క రైతుల పొలాలలో నుండి వెళ్లినది అదే రైతులకు ఈ రోజు సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పరిశీలిస్తామని చెబుతున్నారు కానీ బైపాస్ వరకు వారు మాత్రం ఆపకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని అన్నారు.ఇక్కడ సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన రైతులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఉన్నదని అన్నారు.అంతేకాకుండా తమ్మరలో రెండవ భద్రాద్రిగా విరజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది అదేవిధంగా బండపాలెంలోనే పురాతనమైన దేవాలయం శ్రీ దేవల బాలాజీ దేవాలయానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు వారికి ఈ సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన ఈ దేవాలయాలు కనుమరుగయ్యే పరిస్థితి మెండుగా ఉన్నాయని అన్నారు.

అనంతరం నాలుగవ వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ మాట్లాడుతూ జాతీయ రహదారి నెం.365A తమ్మర,బండపాలెం,అల్వాలపురం గ్రామాల నుంచి వెళ్తున్నది.మా గ్రామాల వద్ద జాతీయ రహదారికి సర్వీస్ రోడ్డు నిర్మాణము చేయకపోవడం వలన మా వ్యవసాయ భూములకు రాకపోకలు సాగించాలంటే కష్టముగా ఉన్నది.మా గ్రామాల వద్ద సర్వీస్ రోడ్డు ఏర్పాటుచేస్తే మా ఇళ్ళ నుంచి వ్యవసాయ భూముల వద్దకు రాకపోకలు సాగించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన మేము 5 నుంచి 6 కిలోమీటర్లు తిరిగిరావాల్సి వస్తుంది. సర్వీస్ రోడ్డు ఏర్పాటుచేయుటకు అవసరమైన భూమిలో నుండి 10 నుంచి 12 అడుగుల వరకు మేము భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు.అనంతరం కనగాల రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు నిర్మించకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి కూడా తీసుకువెళ్లామని అన్నారు.తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతుల యొక్క ఆవేదనను పరిశీలించి సర్వీస్ రోడ్డు నిర్మించి రైతుల ఆవేదనను తీర్చగలరని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు పోతురాజు హరికృష్ణ,గొట్టేముక్కుల కోటి నారాయణ,వేముల దాసు,అలవాల నాగేశ్వరరావు,పసుపులేటి గోవిందు,యర్ర లక్ష్మీనారాయణ,కంబాల అప్పారావు,సన్నె రామకృష్ణ,ఆలేటి వేలాద్రి తదితర రైతులు పాల్గొన్నారు.



