అసత్యాలు మాట్లాడితే ఖమ్మం లో జరిగిన విధంగానే కోదాడలో జరుగుతుంది…….
:ఐదు సంవత్సరాలలో నీవు తెచ్చిన నిధులు 8 నెలల్లో మేము తెచ్చిన నిధుల్లో 50% ఉన్న ముక్కు నెలకు రాస్తాం…………
:అనవసరమైన ఆరోపణలు మానుకొని ప్రతిపక్షంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి……….
:70 వేల ఓట్లతో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు………
:ఆచితూచి మాట్లాడితే మంచిదని మాజీ ఎమ్మెల్యే బొల్లంను హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు………
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 09:వరద బాధితులకు ముంపు గ్రామాల ప్రజలకు ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ భరోసా కలిపిస్తూ గత పది రోజులుగా తిరుగుతున్న మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.మోతే లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తో సమావేశం ఏర్పాటు చేసి వరదలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం అందించిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిని విమర్శించడం అర్ధరహితం అన్నారు.అధికారులు ఇప్పటికే ఇల్లు కూలిపోయిన,పొలాలు మునిగిన,వారికి పరిహారం అందించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని గ్రామాల్లో వరద బాధితులకు నిత్యవసరాలు అందిన మాట వాస్తవం కాదా అన్నారు.మీ హయాంలో ప్రజాప్రతినిధులకు పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా మార్చి అవమానించింది నిజం కాదా అన్నారు.మా నాయకులు,ప్రజా ప్రతినిధులు అధికారులు నిద్రాహారాలు మాని సహాయక చర్యలో నిమగ్నం అయ్యారని మా నాయకులను చూసి బొల్లం నేర్చుకోవాలన్నారు.ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏమి చేయలేక 70 వేల ఓట్లతో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక ఇంట్లో కూర్చొని అసత్యాలు మాట్లాడడం సరికాదన్నారు.ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ అభివృద్ధికి నీవు తెచ్చిన నిధులు 8 నెలలలో మా నాయకులు తెచ్చిన నిధుల్లో 50% ఉంటే ముక్కు నెలకు రాస్తామన్నారు.అనవసరమైన ఆరోపణలు మానుకొని ప్రతిపక్షంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి లేనియెడల ఖమ్మంలో మీ నాయకులపై జరిగిన విధంగా కోదాడలో జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్లు గంధం యాదగిరి,వంటిపులి శ్రీను,వెంకట్,ఖదీర్ పాషా,చందు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.