అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
:ఇక్కడ రోడ్లే కాలవలు.
:రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు వర్షపు నీరు.
:ఆ నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలు.
:పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 11ప్రతినిధి మాతంగి సురేష్: పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు రోడ్డు లేక డ్రైనేజీ వ్యవస్థ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు వాపోతున్నారు.పట్టణ పరిధిలోనే 4వ వార్డులో ఎస్బిఐ బ్యాంకు వెనక పక్క నివాసముంటున్న ప్రజలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లపై మురుగు వర్షపు నీరు మూడవ వార్డులోని సాయిబాబా గుడి,సర్ఫ్ కంపెనీ సమీపంలో నీరు అంతా గల్లీ రోడ్లమీద పారుకుంటూ ప్రధాన రహదారి పైనుండి ఎస్బిఐ బ్యాంకు పక్క వీధిలోకి వచ్చి నీరు అంతా మా ప్రాంతంలో ఆగిపోతుందని వారు వాపోతున్నారు.అంతేకాకుండా రోడ్లు కూడా సక్రమంగా లేవని వారు వాపోతున్నారు.
ఇలా నీరు ఆగినప్పుడు మున్సిపల్ వారు వచ్చి వెళ్ళదీసి చేతులు దులుపుకొని వెళ్తుంటారు.ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని వాపోతున్నారు.అసలే సీజనల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ మురుగునీరు ఆగడం వలన దోమలు ఎక్కువగా వృద్ధి చెంది అవి ప్రజలపై యుద్ధం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు ప్రధాన రహదారి వెంబడి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లయితే మురుగునీరు రోడ్లపై పారకుండా ఉంటుందని వారు వాపోతున్నారు.