ఆంగ్లభాషపై పట్టు సాధించాలి….
ఇంగ్లీష్ డే నిర్వహించడం అభినందనీయం హర్షనీయం…..
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 13(ప్రతినిధి మాతంగి సురేష్):భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి మరియు జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ డే గా ప్రకటించి,నిర్వహించడం అభినందనీయం హర్షినియమని గురువారం నాడు కోదాడ పట్టణం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఇంగ్లీష్ డే కార్యక్రమంలో మండల విద్యాధికారి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు.విద్యార్థులకు ఆంగ్లభాష లో మాట్లాడటం,రాయడంలో మంచి నైపుణ్యాలు,పట్టు సాధించేలా ఉపాధ్యా యులు శిక్షణ ఇవ్వాలని కోరారు.ఆంగ్లభాషలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ అభివృద్ధి చెందితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు,ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చునని తెలియజేశారు.భారత స్వాతంత్ర పోరాటంలో,బహుభాషా ప్రావీణ్యతను కలిగి,కవితా ప్రపంచంలో పేరుగాంచిన హైదరాబాదు వాసి సరోజినీ నాయుడు చేసిన విశేష కృషిని కొనియాడినారు.ఇంగ్లీషు డే, జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆంగ్లభాష ఉపాధ్యాయురాలు వి మీనాక్షి ని శాలువా,పూలమాలలతో సన్మానించడం జరిగింది.సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ఇంగ్లీష్ వ్యాకరణం భాషా నైపుణ్యాలు,ఇంగ్లీష్ పాటలతో కూడిన నృత్యాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ.ఆంగ్ల భాష ఉపాధ్యాయులు కే రామకృష్ణ,బి కనకమ్మ,వి మీనాక్షి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.