ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలనకు చరమగీతం
కోదాడ జూన్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఆంధ్రప్రదేశ్లో సైకో పాలనకు చరమగీతం పాడి తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్ర ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గెలుపు సంబరాలను కోదాడ క్రాస్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం పూలమాలలు వేసి పెద్ద ఎత్తున జరుపుకున్నారు.తెలుగుదేశం కార్యకర్తలు,శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాంబులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తినేని సైదేశ్వర రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి అన్న క్యాంటీన్ మూసివేసి ప్రజా నేత చంద్రబాబును జైల్లో పెట్టి రాజధాని లేని రాష్ట్రం గా మార్చిన సైకో జగన్ వైయస్సార్ పార్టీని ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు గుండ్లపల్లి సురేష్,తెలుగుదేశం రాష్ట్ర సెక్రటరీ భయ్యా నారాయణ,కోడె వాసు,కోదాడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పగండ్ల శ్రీనివాసరావు,చాపల శ్రీను,కొండ సోమయ్య,కొల్లు సత్యనారాయణ,రేవంత్ రెడ్డి,ముత్తవరపు కోటేశ్వరరావు,హరి,రామ్మోహన్,హబీబ్,కొత్త రాంబాబు,ముండ్ర రామారావు,ముండ్ర రవి,బాబా,రామయ్య,సహదేవ్,రాంబాబు,రోశయ్య,సుబ్బారావు,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



