ఆంధ్రాలో కూటమిదే విజయం:బిజెపి యువజన రాష్ట్ర నాయకులు వికాస్ రెడ్డి
మంగళగిరి,మే 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: ఆంధ్రాలో కూటమిదే విజయ డంకా మోగించబోతుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు వికాస్ రెడ్డి అన్నారు.బుధవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకాని గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు వికాస్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి ప్రజల్ని మాయమాటలకి గురిచేసి లేనిపోని పథకాల పేరుతో వాళ్ల ఓట్లను లాక్కొని అధికారంలోకి వచ్చిందని అన్నారు.రాబోయే ఎన్నికలలో కూటమికి భారీ మొత్తంలో ఓట్లు వేసినట్లయితే కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారని అన్నారు.కేంద్రంలో 400 సీట్లతో మళ్లీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని అన్నారు.

టిడిపి హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆ రాష్ట్రాన్ని మళ్లీ వెనకకు తీసుకుపోయిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని అన్నారు.టిడిపి ఎంపీ అభ్యర్థి బ్రహ్మ బేమ్మసాని చంద్రశేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని అన్నారు.ఈ కార్యక్రమంలో జితేందర్,రమేష్ యాదవ్,ఓంకార్,గోపి,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.



