Saturday, December 27, 2025
[t4b-ticker]

ఆంధ్రా తెలంగాణ ఇసుక వ్యాపారస్తుల మధ్య కొట్లాట

*బాహాటంగా దాడులకు పాల్పడుతున్న వ్యాపారస్తులు*

*కొంతమంది అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నామని అంటున్న వ్యాపారస్తులు*

*చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు*

కోదాడ,మార్చి 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని ఇసుక వ్యాపారస్తుల మధ్య గొడవలు రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి.పట్టణంలోని శ్రీ రంగాపురం కాలానికి చెందిన ఓ ఇసుక వ్యాపారి గత కొన్ని సంవత్సరాలుగా అన్ని తానై కోదాడ పట్టణంలో ఇసుకనువ్యాపారం చేస్తున్నాడు.వ్యాపారంలో భాగంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ ఇసుక వ్యాపారి తో సంబంధాలు ఏర్పరుచుకుని గత కొన్ని నెలలుగా కోదాడ పట్టణాన్ని ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు.ఇదే అదునుగా చేసుకొని ఆంధ్రకు చెందిన వ్యక్తి  ఇసుకలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని గమనించి తానే కోదాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని కోదాడలో నివాసం ఏర్పాటు చేసుకొని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సహకారంతో ఇసుక వ్యాపారం చేస్తున్నారు.గతంలో ఆంధ్ర,తెలంగాణ వ్యాపారస్తుల మధ్య ఇసుక వ్యాపారంలో లాభాల పంపకాల విషయంలో తలెత్తిన వివాదం రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరి రెండు వర్గాలుగా ఏర్పడి దాడి చేసుకునే స్థాయికి చేరింది.ఈ నెల 20 వ తేదీ రాత్రి శ్రీ రంగాపురం కాలానికి చెందిన వ్యక్తి హుజూర్ నగర్ రోడ్డు లో ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి కాంటా దగ్గరకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారి తో పాటు కొంతమంది వ్యక్తులు చేరుకుని లావాదేవీల సంభాషణలో భాగంగా శ్రీ రంగాపురం కాలానికి చెందిన ఇసుక వ్యాపారి పై దాడి చేసినట్లు తెలిసింది.కొంత సమయం తరువాత ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కోదాడలో స్థావరంగా ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి కాంట దగ్గరకు పట్టణానికి చెందిన ఇసుక వ్యాపారి తన వర్గానికి సంబందించిన కొంతమంది వ్యక్తులను తీసుకుని పోయి ఆంధ్రా ఇసుక వ్యాపారి పై దాడి చేసినట్లు తెలిసింది.కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ విలేఖరి అండ తనకు ఉందని తాను ఏమి చేసిన అధికారుల మద్దతు తనకే ఉంటుందని బాహాటంగా వెల్లడిస్తూ తనపై దాడులకు దిగుతున్నారని ఆంధ్ర ఇసుక వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.పట్టణంలో ఇసుక వ్యాపారస్తులు ఇంత బాహాటంగా ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.వరుస దాడుల నేపథ్యంలో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు.ఆంధ్ర నుండి రోజుకి 20 టిప్పర్ల ఇసుక కోదాడకు వస్తుంది.ఒక్కొక్క టిప్పర్ కు 40 టన్నుల ఇసుక వస్తుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా టన్నుకు 500 అంటే ఒక్క టిప్పర్ కు వచ్చేసి 20 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి గండి పడుతుంది.ఒకరోజుకు ఈ ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు లక్షల ఆదాయం గండి పడుతుంది కావున సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular